పుస్తకాల పురుగు ఐకాన్ స్టార్..నచ్చిన బుక్ అదేనట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గానే పాపులర్ అవుతున్నాడు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. గంగోత్రి సినిమాతో బన్ని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ కు తెగ క్రేజ్ వచ్చేసింది. అంతే కాకుండా బన్నీ, పరుగు, ఆర్యా 2 లాంటి సినిమాలతో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక బన్నీకి అబ్బాయిలే కాకుండా లేడీ అభిమానులు కూడా ఎక్కువే. మరోవైపు టాలీవుడ్ లోనే కాకుండా మల్లూ వుడ్ లోనూ ఆయన కు అభిమానులు ఉన్నారు. వారు అల్లు అర్జున్ ను ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. ఇక సినిమాల్లో డ్యాన్స్ లు ఫైట్ లతో అదరగొట్టే బన్నీ గురించి మనకు ఎవరికీ తెలియని విషయాలు కూడా ఉన్నాయి. అవేంటంటే…బన్నీ పుస్తకాల పురుగట అంతే కాకుండా ఆయనకు కొన్ని ఇష్టమయిన బుక్స్ కూడా ఉన్నాయట.
2016 లో వచ్చిన ఇండియా టుడే కథనం ప్రకారం.. `హూ మూవ్డ్ మై చీజ్?` అనే పుస్తకం అంటే ఇష్టమట. అంతే కాకుండా వ్యక్తిత్వ వికాసం తెలుసుకునే పుస్తకాలు చదవడం అంటే బన్నీకి ఇష్టమట. ఇప్పుడు బన్నీ పుస్తకాలు చదివే మ్యాటర్ ఎందుకు బయటకు వచ్చిందంటే..తాజాగా బన్నీ ఓ పుస్తకం చదువుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో బన్నికి ఇష్టమైన పుస్తకం ఏంటా అన్నిది తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నికి ఇష్టమైన బుక్ ఏంటన్నదానిపై క్లారిటీ వచ్చింది.