అల్లు అర్జున్ తో సమంత “సామ్ జామ్”

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అక్కినేని సమంత “ఆహా” లో “సామ్ జామ్” అనే టాక్ షో చేస్తుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో “ఆహా”లో సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షో లతో దూసుకుపోతుంది.

తాజాగా “సామ్ జామ్” టాక్ షో కి “అల్లు అర్జున్” గెస్ట్ గా వచ్చినట్లు సోషల్ మీడియాలో ఫోటోస్ దర్శనం ఇస్తున్నాయి. గత ఎపిసోడ్స్ లో తమన్నా గెస్ట్ గా వచ్చి అలరించింది. బొల్డ్ క్వషన్స్ తో తమన్నాను సమంత ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ ఎపిసోడ్ లో మీరు లిప్ కిస్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడున్న యువ హీరోల్లో ఎవరికి ఇస్తారు అని అడగగా.. అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ అంటూ తమన్నా సమాధానం చెప్పింది. న
ెక్స్ట్ ఎపిసోడ్ కు వస్తున్న అల్లు అర్జున్ ను సమంత తన క్రేజీ ప్రశ్నలతో ఇబ్బింది పెట్టెలగా ఉంది. నిహారికా పెళ్లి కి హాజరు అయి ఇటీవల హైదరాబాద్ వచ్చిన బన్నీ, తన తదుపరి షూటింగ్ లతో బిజీ అవ్వుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆహా కు గెస్ట్ గా వచ్చాడు. అల వైకుంటపురంలో చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ తో నిలిచిపోయిన “పుష్ప” ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రముఖ లేడి దర్శకురాలు నందిని రెడ్డి ఆద్వర్యంలో “ఆహా” “సామ్ జామ్” టాక్ షో నడుస్తుంది.
