బన్నీ వాసుకు అల్లు సోదరుల పరామర్శ.!

Allu Arjun in Palakollu To Offer Condolence To Bunny Vasu
Allu Arjun in Palakollu To Offer Condolence To Bunny Vasu

ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సోదరుడు గవర నరేష్ అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాంతో బన్నీ వాసు ఇంట విషాదం నెలకొంది.

కాగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు ఆయన సోదరుడు అల్లు శిరీష్ లు పాలకొల్లు వచ్చి బన్నీ వాసు కుటుంబాన్ని పరామర్శించారు. వారితో పాటు ఎమ్మెల్యే శ్రీ డా.నిమ్మల రామానాయుడు, జనసేన పాలకొల్లు నియోజక వర్గ ఇంచార్జి గుణ్ణం నాగబాబు కూడా బన్నీ వాసు కుటుంబాన్ని పరామర్శించారు. అల్లు అర్జున్..బన్నీ వాసు ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ వాసు గీత ఆర్ట్స్ బ్యానర్ ను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. అంతే కాకుండా ఆయన అల్లు అర్జున్ తో క్లోస్ గా ఉండటంతోనే ఆయనకు బన్నీ వాసు అని పేరు వచ్చింది.