బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..AA 21 పై అదిరిపోయే అప్డేట్.!

  • Written By: Last Updated:
బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..AA 21 పై అదిరిపోయే అప్డేట్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ హీరోగా కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ AA2 గా పెట్టారు. ఈ సినిమా చేస్తున్నట్టు గతేడాది జులై లో అల్లు అర్జున్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోంది. ఈ సినిమా ప్రొడక్షన్ కొత్త ఆఫీస్ ను తెరవబోతున్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అంతే కాకుండా సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు సాయి మంజ్రీకర్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. సాయి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సినిమాలో నటించి అలరించింది. ఇక ప్రస్తుతం అడవి శేషు హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు కొరటాల విషయానికొస్తే ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఆ వెంటనే అల్లు అర్జున్ సినిమాను కొరటాల పట్టాలెక్కిస్తారు.

follow us