అల్లు అర్జున్ ను లైన్ లో పెట్టిన అనిల్ రావిపూడి..!

allu arjun next movie with anil ravipudi
allu arjun next movie with anil ravipudi

ప‌టాస్ సినిమాతో టావీవుడ్ కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా త‌ర‌వాత రాజా ది గ్రేట్, సుప్రీమ్, ఎఫ్ 2 వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించాడు. ఈనేప‌థ్యంలో మ‌హేశ్ బాబు తో ఛాన్స్ కొట్టేసి స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇక ప్ర‌స్తుతం అనిల్ ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఎఫ్ 3ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం అనిల్ రావిపూడి అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడట‌. ఇది వ‌ర‌కే అల్లు అర్జున్ అనిల్ రావిపూడి తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్న‌ట్టు వార్త‌లు వచ్చాయి.

కాగా అనిల్ రావి పూడి ఇప్ప‌టికే బ‌న్నీకి క‌థ‌ను కూడా వినిపించాడ‌ని ఆ క‌థ‌కు బ‌న్నీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదే క‌నుక నిజం అయితే అల్లు అర్జున్ సైన్ చేసిన సినిమాల‌న్నీ పూర్తి చేసుకుని ఈ ప్రాజ‌క్టును మొద‌లుపెడతారు. ఇక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో పుష్ప సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇటీల‌వలే విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. ఈ సినిమా ఆగ‌స్టులో విడుద‌ల కానుంది.