కేక పుట్టిస్తున్న బన్నీ లుక్..పుష్ప రిలీజ్ డేట్ ఇదే

  • Written By: Last Updated:
కేక పుట్టిస్తున్న బన్నీ లుక్..పుష్ప రిలీజ్ డేట్ ఇదే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన నటిస్తోంది. సినిమాను మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. చిత్రాన్ని గంధపు చెక్కల స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ కరోనా లాక్ డౌన్ వల్ల ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం అడవుల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక తాజాగా చిత్ర యూనిట్ సినిమాపై కీలక అప్డేట్ ను ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న రిలీజ్ చేస్తునట్టు ప్రఙకటించింది. ఈ సందర్భంగా బన్నీ పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో బన్నీ గొడ్డలి చేత పట్టుకుని ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు పోస్టర్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

follow us