స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. క్రేజీ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా టీజర్ ను ఎప్రిల్ 8న సాయంత్రం విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నర్ గా నిలిచిన ఎడిటర్ ను రంగంలోకి దించారు. ఇదిలా ఉండగా పుష్ప సినిమాను రెండు పార్టులు గా తెరకెక్కిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటివరకు రెండు పార్టులుగా ఏ సినిమాను తెరకెక్కించలేదు. అయితే ఈ సినిమా కథ పరంగా రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నారట. ఇక ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.