ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు తమ కార్యక్రమాలను…రక్షించేందుకు తీసుకువచ్చిన యాప్ లను జనాల్లోకి తీసుకువెళ్లాడనికి వినూత్న దారులను అవలంభించడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా కూడా ప్రచారం చేయటం చూస్తున్నాం. ఇక మన రాష్ట్ర పోలీసులే కాకుండా కేరళ రాష్ట్ర పోలీసులు కూడా మన హీరోలను తమ యాప్ ప్రమోషన్ కోసం వాడుకోవడం ఆశ్చర్యం. తాజాగా కేరళ పోలీసులు కష్టం వస్తే క్షణాల్లో మీ ముందు ఉంటామని చెప్పడానికి అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసు గుర్రం సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఉపయోగిస్తున్నారు.
ఈ వీడియోలో అల్లు అర్జున్ తన కుటుంబాన్ని కాపాడటానికి బులెట్ లా వస్తాడు. దాంతో రౌడీలు కారు అద్ధాల్లో నుండి భయట పడతారు. ఇక మేము కూడా “పోల్” యాప్ లో ఒక్క క్లిక్ చేస్తే అలానే వచ్చి మిమ్మల్ని రక్షిస్తామని కేరళ పోలీసులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే మరి కొంతమంది నెటిజన్లు మాత్ర బన్నీ హెల్మెట్ కూడా పెట్టుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు. వాళ్ళు చెప్పేది కూడా ఒకంతుకు మంచిదే. హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఒకే వీడియోతో రెండింటి పై అవగాహన కలిగేది.