రౌడీ కి థాంక్స్ చెప్పిన స్టైలిష్ స్టార్ !

అల వైకుంటపురంలో చిత్రం విజయం తరువాత అల్లు అర్జున్ పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన డిఫ్ఫరెంట్ లూక్స్ తో ఉన్న ఫోటోస్ ను తన ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. దానికి కారణం అయిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పాడు. అసలు విషయం ఏమిటి అంటే విజయ్ దేవరకొండ రౌడీ అనే స్పెషల్ డ్రెస్సింగ్ బ్రాండ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఆ బ్రాండ్ నుంచి అల్లు అర్జున్ కు ఓ కలెక్షన్ ను పంపించాడు. ఆ బట్టలు వేసుకున్న అల్లు అర్జున్ కూల్ లూక్స్ తో చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. స్టైలిష్ స్టార్ ను ఇంత అందంగా చూపించినందుకు నెటిజన్స్ కూడా విజయ్ దేవరకొండ కు థాంక్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ థాంక్స్ మై బ్రదర్ విజయ్ దేవరకొండ అంటూ స్పెషల్ థాంక్స్ టూ “రౌడీ” టీమ్ అంటూ ట్విటర్ ద్వారా విష్ చేశాడు.