అల్లు అర్జున్ – సుకుమార్ సినిమా ఆగిపోతుందా ?

సుకుమార్ అల్లు అర్జున్ తో ఇంకో సినిమా ప్లాన్ చేశారు , అంత సిద్ధం అయ్యింది.. డిసెంబర్ లోనే ఈ సినిమా మొదలు అవ్వవలసి ఉంది కానీ సినిమా గురించి ఒక అప్డేట్ కూడా లేదు , ఎందుకు అంటే అల్లు అర్జున్ ఫైనల్ స్క్రిప్ట్ విన్నారు.. విన్నాక అల్లు అర్జున్ తృప్తి చెందలేదు… మార్పులు అడిగారు సుకుమార్ ని సెకండ్ హాఫ్ లో.. దానికి కోసం సుకుమార్ బృందం తో కలిసి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు..
మహేష్ బాబు ఈ సినిమా నుంచి బయటికి రావడానికి కారణం కూడా ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ అని తెలిసిన విషయమే.. మరి ఇప్పుడు సుకుమార్ ఎంత వరకు మార్పులు చేస్తారు అవి ఎంత వరకు అల్లు అర్జున్ కి నచ్చుతాయో .. లేకపోతే అర్జున్ ఐకాన్ సినిమా లాగా ఇది కూడా ఆగిపోతుందా అని ఫ్యాన్స్ ఇప్పటికే టెన్షన్ మొదలు అయ్యింది.