కరోనాను జయించిన పుష్ఫరాజ్.. !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా బన్నీ వెల్లడించారు. ఈ మేరకు బన్నీ చేసిన పోస్ట్ లో పదిహేను రోజుల తరవాత నేను మళ్లీ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. నాకు నెగిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం కొరకు ప్రార్థనలు చేసిన సన్నిహితులకు అభిమానులకు కృతఙ్జతలు తెలుపుతున్నాను. ఈ లాక్ డౌన్ తో కేసుల సంఖ్య తగ్గాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. అంటూ బన్నీ పేర్కొన్నారు. ఇక బన్నీ పదిహేను రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్ లోనే ఆయన చికిత్స తీసుకున్నారు.మొత్తానికి నేడు కరోనాను జయించేశారు.
స్టైలిష్ స్టార్ కు కరోనా రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. తమ హీరో కరోనా నుండి కోలుకోవాలని దేవుళ్లకు పూజలు కూడా చేశారు. ఇక బన్నీ కరోనా ను జయించడం తో అభిమానులు కుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. బన్నీకి విలన్ గా ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. కారోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక కరోనా తగ్గుముఖం పట్టగానే షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు.