అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్..!

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిచికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. తాజాగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిందని హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నానని బన్నీ పేర్కొన్నారు. కరోనా నిభందనలు పాటిస్తూ ఇంట్లోనే ఉన్నానని తెలిపారు. అంతే కాకుండా తనకు కాంటాక్ట్ అయిన వాళ్లు కూడా టెస్ట్ చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం తన ఆరోగ్యం భాగానే ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందవద్దని తెలిపారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. ఆయన కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తరవాత కూడా కరోనా బారిన పడ్డారు. ఇక టాలీవుడ్ లో సెకండ్ వేవ్ సమయంలో కరోనా బారిన పడిన వారిలో పవన్ కల్యాణ్, పూజా హెగ్డే, కల్యాణ్ దేవ్, త్రివిక్రమ్, నివేధితా తామస్ మరికొందరు నటీనటులు ఉన్నారు.