గజినీ సీక్వెల్ లో బన్నీ.. ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సినిమాలో అల్లు అర్జున్ కు హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుండగా…విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాను గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దాంతో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల కాగా 50మిలియన్ వ్యూవ్స్ ను దాటి దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తరవాత బన్నీ ఏ సినిమాలో నటిస్తారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే తాజాగా మాత్రంలో ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన గజినీ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను బన్నీ చేయబోతున్నారట. అంతే కాకుండా గజినీ తెరకెక్కించిన మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ కుటుంబ బ్యానర్ గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందట. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకె్కించబోతున్నారట. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.