అప్డేట్ : సుకుమార్ సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్

allu arjun to join sukumar movie shooting
allu arjun to join sukumar movie shooting

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజా సినిమా అల.. వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లోకి సాంగ్స్ స్టిల్స్ , ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . త్రివిక్రమ్ అల్లు అర్జున్ న్ని ఇంకా స్టైల్ గా ఈ సినిమాలో చూపించబోతున్నారు . 

అల్లు అర్జున్‌ ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే సుకుమార్ కథ ని ఒకే చేశాడు , అల్లు అర్జున్ ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్లో రెండు సూపర్ డూపర్ హిట్స్ కొట్టి ఉన్నాడు . సుకుమార్ ఈ సినిమా కోసం ట్రయిల్ షూట్ కేరళ లో చేస్తున్నారు . అల్లు అర్జున్ లేని సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేశారట . తాజా అప్డేట్ ఏంటి అంటే అల్లు అర్జున్ జనవరి 12న సుకుమార్ షూటింగ్ లో జాయిన్ అవుతాడట . ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం.