అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఎప్రిల్ 28న కరోనా పాజిటివ్ రావడంతో అల్లు అర్జున్ హోం క్వారంటైన్ లో ఉండిపోయారు. బన్నీకి కరోనా రావడంతో ఆయన అభిమానులు తెలుగు ప్రేక్షకులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ గుడుల్లో ప్రార్థనలు కూడా చేశారు. అయితే బన్నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి పై అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రస్తుతం కొద్దిపాటి లక్షణాలతో బాధపడుతునట్టు బన్నీ ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతే కాకుండా తాను కోలుకుంటున్నానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లోనే ఉన్ననని ప్రేమ అభిమానాలు చూపిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా తన కోసం ప్రార్థిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నారు. లెక్కల మాస్టారు సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.