అనూ ఇమాన్యుయేల్ కు అల్లు శిరీష్ అదిరిపోయే గిఫ్ట్…!

  • Written By: Last Updated:
అనూ ఇమాన్యుయేల్ కు అల్లు శిరీష్ అదిరిపోయే గిఫ్ట్…!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో అనూఇమాన్యుయేల్ యంగ్ హీరో అల్లు శిరీష్ ల మ‌ధ్య ఏదో జ‌రుగుతుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దానికి తోడు సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రూ చేసే ర‌చ్చ అనుమానాల‌కు దారి తీస్తోంది. ఇద్ద‌రూ క‌లిసి కాఫీ షాపుల్లో క‌బుర్లు చెప్పుకోవ‌డం, షూటింగ్ లోకేష‌న్లు, భ‌య‌ట పార్టీల్లో ర‌చ్చ చేయ‌డంతో ఇద్ద‌రూ డేటింగ్ లో ఉన్నార‌నే పుకార్లు గుప్పుమంటున్నాయి. అంతే కాకుండా అనూ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అల్లు శిరీష్ చేసిన ఓ వీడియో నెట్టింట హ‌ల్చ‌ల్ చేసింది. ఇక ఇప్పుడు మ‌రొసారి వీరి వ్య‌వ‌హారం వార్త‌ల్లో నిలిచింది. తాజాగా అనూ ఇమాన్యుయేల్ కు అల్లు శిరీష్ ఓ గిఫ్ట్ ను పంపించాడు. ఆ గిఫ్ట్ ఓ టీష‌ర్ట్ కావ‌డం విశేషం.

ఇక ఆ టీష‌ర్ట్ పై ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ రాసి ఉంది. ఇక ఆ టీష‌ర్ట్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన అనూ వెరైటీగా స్పందించింది. తాను దీనిని కాంప్లిమెంట్ గానే తీసుకుంటున్నాన‌ని ..త‌న‌కు సెట్ అయ్యే టీష‌ర్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ పేర్కొంది. ఇక అనూ కు రిప్లై ఇచ్చిన శిరీష్..అలా అయితే మ‌నిద్ద‌రి మ‌ధ్య కామ‌న్ విష‌యాలెన్నో యు ఆర్ వెల్ క‌మ్ మై….. అంటూ డ్యాష్ పెట్టాడు. దాంతో అల్లు శిరిష్ మ‌ళ్లీ కొత్త డౌట్ క్రియేట్ చేశారు. ఇక ఇద్ద‌రూ ఇలా సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చేస్తున్నారా..? లేదంటే నిజంగానే ఇద్ద‌రి మ‌ధ్య ఏమైనా ఉందా తెలియాలంటే వాళ్లు నోరు విప్పాల్సిందే.

follow us