ఆరో తరగతిలో ప్రేమ.. పదహారేళ్లలోనే ఆ పని? బెల్లంకొండ సాయి

  • Written By: Last Updated:
ఆరో తరగతిలో ప్రేమ.. పదహారేళ్లలోనే ఆ పని? బెల్లంకొండ సాయి

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభానటేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో గొర్రెల సుబ్రమణ్యం నిర్మించిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 15న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచుతుంటే.. రిలీజ్‌ లోపు మరిన్ని సర్‌ప్రైజ్‌లతో సినిమాపై భారీగా అంచనాలను పెంచేలా చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. అందులో భాగంగా చిత్రయూనిట్‌ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన మొట్టమొదటి క్రష్ ఆరో తరగతిలో ఓ అమ్మాయి అని రివీల్ చేశాడు సాయి శ్రీనివాస్. అలాగే, తన జీవితంలో చేసిన పెద్ద తప్పు గురించి చెబుతూ.. ‘నేను పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు మందు తాగాను. అది తెలిసి మా నాన్న నాతో వారం రోజులు మాట్లాడలేదు. అప్పుడు నా తప్పు తెలుసుకుని.. మళ్లీ అలా చేయలేదు’ అని చెప్పుకొచ్చాడు.

follow us