అమలా పాల్ “ఆహా” ఫాంటసీ థ్రిల్లర్

అల్లు అరవింద్ “ఆహా” జోరును మరింత పెంచడానికి రెడీ అవ్వుతున్నాడు. అందుకోసం ఇప్పటికే వెబ్ సిరీస్, కొత్త సినిమాలు, టాక్ షోస్ చేస్తూ అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జి5 వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వాటి సరసన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
టాలీవుడ్ హీరోయిన్ సమంత తో “సామ్ జామ్” అనే టాక్ షో ను నడిపిస్తున్నాడు. ఈ షో కి ఇప్పటికే పలువురు స్టార్స్ ముఖ్య అతిదులుగా విచ్చేసి అలరించారు. ఆహా కోసం సరికొత్త షో ఒక్కటి చెయ్యడానికి అల్లు అరవింద్ రెడీ అవ్వుతున్నాడు. అందుకోసం ప్రముఖ దర్శకుడు పవన్ ను సంప్రదించినట్లుగా సమాచారం. ఈయన యూటర్న్, లూసియా వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
దీపా మెహతా శంకర్ రామన్ ముఖ్య పాత్రలో “లైలా” అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ను కూడా తీశాడు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయింది. ఇప్పుడు “ఆహా” కోసం థ్రిల్లర్ ఫాంటసీ షో ని చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. మలయాళీ నటి అమలా పాల్ ముఖ్య పాత్రలో ఈ ఫాంటసీ షో నడుస్తుంది.
అందుకు సంబందించిన పేరు పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అల్లు అరవింద్ మాత్రం ఓ వైపు సినిమాలను నిర్మిస్తూ ఆహా కు మంచి గుర్తింపు తీసుకురావడాని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.