కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతి కి రాజధాని రైతుల లేఖలు

  • Written By: Last Updated:
కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతి కి రాజధాని రైతుల లేఖలు

వైస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మారుస్తున్నాము అని అసెంబ్లీ ప్రకటన చేసిన రోజు నుండి అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కష్టాలు అన్ని ఇన్ని కాదు,  ఎన్నో ఆశలు పెట్టుకొని గత ప్రభుత్వంలో భూములు ఇచ్చామని పేర్కొన్నారు . ప్ర‌భుత్వాన్ని న‌మ్మి మాత్ర‌మే భూములు ఇచ్చార‌ని, గ‌త ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్యాన్ని పాటించింద‌ని పేర్కొన్నారు. గ‌తంలో సిఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కూడా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నార‌ని గుర్తు చేశారు.

ఈ రోజు రాజధాని రైతులు కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతి కి లేఖలు రాశారు. రాజధాని విషయంలో మోసపోయినందున చనిపోయే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి లేఖలో పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి  తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో మేమంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డాం.  అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని  ,కేవలం ముఖ్యమంత్రి , పలువురు వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని , రాజధాని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. పైగా  కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారని లేఖలో రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

follow us