ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ప్రేమలో అమీర్ ఖాన్ కూతురు

  • Written By: Last Updated:
ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ప్రేమలో అమీర్ ఖాన్ కూతురు

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన విభిన్న మైన సినిమాలతో నెంబర్ వన్ హీరోగా వస్తున్నాడు. ఆయన నటించినటువంటి దంగల్ సినిమాతో సౌత్ లోనూ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించాడు. సోషల్ మీడియా ద్వారా తన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటాడు. అమీర్ ఖాన్ కూతురు ఐరా గురించిన వార్తలు నేషనల్ పత్రికలు కొడై కుస్తున్నాయి. ఇంతకు ఏమిటి అనుకుంటున్నారా.

ఐరా ఖాన్ ప్రేమలో పడిన్నట్లుగా, అమీర్ కు పర్సనల్ ఫిట్ నేస్స్ ట్రైనర్ గా ఉన్న నుపూర్‌ షీఖరే తో ఏడాది కాలంగా డేటింగ్ లో ఉన్నదని త్వరలోనే వీరి ప్రేమను పెల్లిగా మార్చుకోబోతున్నారని బీ టౌన్ లోను వార్తలు వస్తున్నాయి. అమీర్ పర్సనల్ ట్రైనింగ్ ఉన్న నుపూర్‌ షీఖరే, ఐరా కు కొన్ని నెలలు గా శిక్షణ ఇస్తున్నాడు. ఆ సమయంలో ఐరా ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. వ్యక్తిగతంగా మంచి వాడు కావడం, తన మనసుని అర్థం చేసుకోవడంతో తనకు నచ్చాడని, ఇదే విషయాన్ని ఆమె తన తల్లి కి చెప్పినట్లుగా, ఆమె కూడా అంగీకారం తెలపడం తో ఈ జంట ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

తాజాగా ఈ జంట అమీర్ ఖాన్ ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంది అందుకు సంబందించి, ఐరా ఖాన్, నుపూర్‌ షీఖరే ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. వీరి ప్రేమ విషయం పై అమీర్ ఖాన్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఐరా ఇంతకు ముందు మిషాల్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నది. ఆ తరువాత కొన్ని కారణాలతో వారు విడిపోయారు.

follow us