మమ్ముట్టితో మలయాళ ఎంట్రీ ఇవ్వనున్న అనసూయ

  • Written By: Last Updated:
మమ్ముట్టితో మలయాళ ఎంట్రీ ఇవ్వనున్న అనసూయ

ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోన్న యాంకర్, నటి అనసూయ.. విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాతో కోలీవుడ్ లోనూ పాదం మోపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనసూయ మలయాళ సినిమాలో సైతం ఎంట్రీ ఇస్తూండడం విశేషంగా మారింది. మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించే ఇంకా పేరుపెట్టని ఓ సినిమాలో అనసూయని ఓ ప్రధాన పాత్ర కోసం సంప్రదించాడట ఆ సినిమా దర్శకుడు. అందులో తన పాత్ర బాగా నచ్చి అనసూయ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆల్రెడీ అనసూయ మమ్ముట్టి నటించిన తెలుగు సినిమా యాత్రలో ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని, అనసూయ ఆ సినిమా కోసం బాగానే డేట్స్ కేటాయిస్తున్నట్టు టాక్. అనసూయ నటించిన కొన్ని తెలుగు సినిమాలు మలయాళంలో కూడా అనువాదం అయ్యాయి.

follow us