యంకర్ ప్రదీప్ ఇంట తీవ్ర విషాదం..!

కరోనా వేల టాలీవుడ్ లో రోజుకో విషాదం నెలకొంటుంది. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాండురంగ ఈ రోజు కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన కన్నుమూశారు. మరోవైపు ప్రదీప్ కు కరోనా వచ్చిందని కొన్నిరోజులుగా వార్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజులుగా ప్రదీప్ ఈటీవీ ఢీ, జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో లకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ విషయంపై ప్రదీప్ ఇప్పటి వరకూ స్పందించలేదు.
అంతే కాకుండా ఆయన ప్రస్తుతం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దాంతో ఆయన స్థానంలో ఇప్పుడు యాంకర్ రవి ఆ షోలకు యాంకరింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా ప్రదీప్ తండ్రి పాండు రంగ కూడా బారిన పడ్డారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రదీప్ తండ్రి కరోనాతో మరణించారా లేదంటే ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే మరణించారా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రదీప్ చాలా చిన్న స్థాయి నుండి తెలుగులో ప్రముఖ యాంకర్ స్టేజ్ కి ఎదిగారు. ఇంతకాలం బుల్లి తెరపై రాణించి ఇప్పుడు వెండితెరపై కూడా మెరుస్తున్నారు. ఇలాంటి సమయంలో తండ్రిని కోల్పోవడం బాధాకరం.