నాగ్ సరసన హాట్ యాంకర్.. !

కింగ్ నాగార్జున ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. ఇటీవలే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మిశ్రమస్పందన లభించింది. ఇక ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా సినిమా సీక్వెల్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. లాక్ డౌన్ తరవాత ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగానే నాగ్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లోనూ ఓ సినిమా రాబోతుంది.
అయితే ఈ సినిమాలో రష్మి గౌతమ్ కీలక పాత్రలో నటించేందుకు ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఇక రష్మీ ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లో నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమాలో రష్మి హాట్ అందాలతో కుర్రాళ్ల మతిపోగొట్టింది. ఇక ఇప్పుడు మళ్లీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న సినిమాలోనే ఓ అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. గుంటూరు టాకీస్ సినిమాలో గ్లామరస్ పాత్రలో నటించిన రష్మీ యాక్షన్ థ్రిల్లర్ లో ఏ పాత్ర చేస్తుందా అన్న ఆసక్తి మొదలైంది.