సుమతో కలిసి నవ్వులు పూయిస్తున్న సింగర్ సునిత..ఫోటో వైరల్

  • Written By: Last Updated:
సుమతో కలిసి నవ్వులు పూయిస్తున్న సింగర్ సునిత..ఫోటో వైరల్

టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయని సునిత సింగర్ గా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అంతే కాకుండా సునిత ముందు నుండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను ఫ్యామిలీ ముచ్చట్లను షేర్ చేసుకునేది. ఇక ఇటీవల సునిత మాంగో మీడియా అధినేత రామ్ ను పెళ్లి చేసుకుని మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అయితే నాలుగు పదుల వయసులో సునిత రెండో పెళ్లి చేసుకోవడంపై కొందరు పాజిటివ్ గా..మరి కొందరు నెగిటివ్ గా స్పందించారు.

కానీ సునిత అవేమీ పట్టించుకోకుండా తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. అంతే కాకుండా పెళ్లి మూడ్ నుండి భయటకు వచ్చి మళ్లీ సరదాగా గడుపుతోంది. రీసెంట్ గా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” సినిమా ఫంక్షన్ లో సందడి చేసింది. ఇక తాజాగా ప్రముఖ యాంకర్ సుమ కనకాలతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటో చూసిన సుమ అభిమానులు.. సునిత అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

follow us