ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు, గవర్నర్ కు ఎలక్షన్ కమిషనర్ రిపోర్ట్

  • Written By: Last Updated:
ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు, గవర్నర్ కు ఎలక్షన్ కమిషనర్ రిపోర్ట్

ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదన్న సీఎస్ ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని లేఖలో కోరారు.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని నియంత్రణ చర్యలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటోందని సీఎస్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్ట వచ్చని సూచన చేశారు.

పోలింగ్ రోజున జనం గుమికూడకుండా చూడవచ్చని సీఎస్ లేఖలో రాశారు . మరో మూడు నాలుగు వారాల పాటు కరోనా అదుపులోనే ఉంటుందని , స్థానిక ఎన్నికలు యధాతథంగా నిర్వహించాలని ఎస్ఈసీకివిజ్ఞప్తి చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని, అది కూడా ఇటలీ నుండి వచ్చిన ఒక వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు , స్థానికంగా ఎవ్వరికీ కరోనా సొకలేదని పేర్కొన్నారు.

అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటోంది. అలాగే ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ ఈ రోజు ఏపీ గవర్నర్ ను కలిసి ఎలక్షన్స్ పోస్టుపోన్ మీద రిపోర్ట్ అదించబోతున్నారు.

follow us