ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు నగారా మోగింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి . జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17 వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 15 వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
జెడ్పిటిసి, ఎంపిటిసి, పంచాయితీ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం రిజర్వేషన్లను కన్ఫర్మ్ చేసే పనిలో ఉన్నది. దీని తరువాత నోటిఫికేషన్ ఉంటుంది. అయితే, గ్రామ పంచాయితీ కార్యాలయాలకు వైకాపా పార్టీ మూడు రంగులు వేయడాన్ని హైకోర్ట్ తప్పుపట్టింది. మూడు రంగులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. పంచాయితీ కార్యాలయాలు ప్రభుత్వానికి సంబంధించినవి అని, వాటికి పార్టీ రంగులు వేయడం మంచి పద్దతి కాదని చెప్పింది. ఇక ఈ ఎన్నికలు కూడా పార్టీలకు సంబంధించిన గుర్తుల మీదనే జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందో చూడాలి.