టీడీపీ నుంచి మరో వికెట్ అవుట్

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తెలంగాణ లో జరిగినట్టే ప్రతిపక్షం లేకుండా పోతుంది ఏమో అని కంగారు ప్రజలలో ఇప్పటికే మొదలయ్యింది… ఒక్కోరు గా టీడీపీ నుంచి వైస్సార్సీపీ లోకి చేరిపోతున్నారు.. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక కర్నూల్ లో జరిగిన ఒక సమావేశం లో మాట్లాడుతు తొందరలో ఇంకో టీడీపీ నాయకుడు పార్టీ ని వదిలి వైస్సార్సీపీ లో చేరుతున్నారు అని చెప్పారు..
ఇప్పటికే వల్లభనేని వంశీ , అవినాష్ చేరడం వాళ్ళ పార్టీ విజయవాడ లో పట్టు పోయింది.. ఇంకా ఇప్పుడు అలాంటి ముఖ్య నేత ఇంకొకరు పార్టీ వదిలితే టీడీపీ చాల ఇబ్బంది పడుతుంది.. అనిల్ కుమార్ యాదవ్ మాటలు టీడీపీ పార్టీ నాయకులకి ఒక రకమైన టెన్షన్ వాతావరణం సృష్టించింది..