టీడీపీ నేతలు స్వేచ్ఛగా తిరగగలరా..?

తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారి మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్… కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు.

ఇక, చంద్రబాబు అవినీతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టిపెడితే తట్టుకోగలరా? అంటూ ప్రశ్నించిన మంత్రి.. మేం ఫ్యాక్షనిస్టులమైతే టీడీపీ నేతలు స్వేచ్ఛగా తిరగగలరా? అంటూ మండిపడ్డారు. అమరావతి రైతులను టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నారన్న ఆయన.. అమరావతి రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. ఇక, ప్రతి విషయానికి కోర్టుకు వెళ్లడం టీడీపీ నేతలకు అలవాటు అని ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.