మహేష్ పిలుస్తే ఎప్పుడైనా రెడీ

జెనరేషన్ మారుతున్న కొద్ది దర్శకులు, హీరోలు మారుతూ వస్తున్నారు, యాక్షన్, కామిడీ, లవ్, ఎమోషన్స్ తో కూడిన స్టోరీస్ ఇలా ఒక్కో కాన్సెప్ట్ కి ఒక్కో దర్శకుడు ప్రసిద్ది. పలాన దర్శకుడు కామిడీ మూవీస్ బాగా తీస్తాడు, మరో దర్శకుడు యక్షన్ మూవీస్ బాగా తీస్తాడు, ఇంకో దర్శకుడు కామిడీ, యాక్షన్, లవ్ మూవీస్ అన్నికలిపి బాగా తీయగలడు అనే పేరును ప్రేక్షకుల నుండి సంపాదించుకుంటారు.
ఒకప్పుడు కామిడీ మూవీస్ తియ్యాలంటే జంధ్యాల గారి పేరు బాగా వినిపించేది. ఆ తరువాత అతని స్థానంలోకి ఈవివీ సత్యనారాయణ గారు, వంశీ గారు, వచ్చి చేరారు. తమదైన స్టయిల్ తో ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చారు. ప్రస్తుత్త జెనరేషన్ లో వీళ్ళ స్థానంలోకి యువదర్శకుడు అనీల్ రావిపూడి వచ్చి చేరారు. ఇప్పటి వరకు అనీల్ చేసినవి సినిమాలు కామిడీ టైమింగ్ తో కూడి ఉంటాయి అలాగే మంచి లవ్ అండ్ ఎమోషన్స్ ను కూడా పండించగలడు. కళ్యాణ్ రామ్ తో సినిమా మొదలుకుని సరిలేరు నీకేవ్వరు చిత్రం వరకు వరస హిట్స్ తో దూసుకెళ్లుతున్నాడు.
మహేష్ బాబు కు 2020లో ‘సరిలేరు నీకేవ్వరు’ అనే సూపర్ హిట్ చిత్రం ను ఇచ్చాడు. ఆ సమయంలో మహేష్ బాబు అనీల్ తో మరో సినిమా చేస్తానని చెప్పాడు. తాజాగా అనీల్ రావిపూడి బర్త్ డే సందర్బంగా మహేష్ బాబు తో సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ లో ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు. మహేష్ అనీల్ అని పిలుస్తే చాలు పరిగెత్తుకెళ్ళి ఆయన ముందు కూర్చుంటాను. ఆయన ఇంట్లో చేసే చెఫ్ స్నాక్స్ తింటూ ఆయనకు కథను చెప్పుతాను అంటూ ఎంతో ఎగ్జయిట్ అయ్యారు.
ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ కోసం రెడీ అవ్వుతున్నాడు. అనీల్ కూడా ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 స్క్రిప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నాడు. తన స్నేహితుడిని నిర్మాత గా ఆ చిత్రంతో పరిచయం చేస్తున్నాడు. నా సినిమా కెరీర్ లో అండగా నిలిచిన నిర్మాతల అందరికి నా కృతజ్ఞతలు. మహేష్, అనీల్ రావిపూడి కాంబో మొదలు అవ్వాలంటే మరి కొంతకాలం వరకు అగాలిసిందే.