ఒక మనిషి జంతువు గా మారితే ఇలాగే ఉంటుందేమో

ఒక మనిషి జంతువు గా మారితే ఇలాగే ఉంటుందేమో

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత అదే కథతో హిందీలో కబీర్ సింగ్ తీసి అక్కడ కూడా తెలుగు దర్శకుడు తన సత్తా చాటాడు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారడమే కాకుండా పాన్ ఇండియా హీరోలను తన గుప్పిట్లో పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం సందీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మీక హీరోయిన్ గా నటిస్తోంది.

గుల్షన్ కుమార్ మరియు టి సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రణబీర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ లో రణబీర్ లుక్ చూస్తుంటే టైటిల్ కు తగ్గట్టు యానీమల్ గానే కనిపిస్తున్నాడు. ఒంటినిండా రక్తం, చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలి, ఏ ఏమోషన్ లేకుండా రణబీర్ సిగరెట్ ను వెలిగిస్తూ కనిపించాడు. నిజంగా జంతువులా వేటాడితే ఒక మనిషి ఇలాగే ఉంటాడేమో అని అనిపించక మానదు. పోస్టర్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు సందీప్. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో ఆగస్ట్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సందీప్ మరో సంచలనాన్ని సృష్టిస్తాడేమో చూడాలి.

follow us

Related News