67th national film awards : ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ…!

67వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కాగా జాతీయ ఉత్తమ చిత్రం తెలుగు అవార్డుకు జర్సీ సినిమా ఎంపికైంది. సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. అంతే కాకుండా ఎడిటింగ్ విభాగంలో జర్సీ సినిమాకు ఎడిటర్ గా వ్యవహరించిన నవీన్ నూలి దక్కించుకున్నారు. ఇక మహర్షి సినిమాకు ఏకంగా మూడు అవార్డులు దక్కాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయి.
67వ జాతీయ చలన చిత్ర అవార్డులు
* ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
* ఉత్తమ ఎడిటర్ – జెర్సీ(నవీన్ నూలీ)
* ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి
* ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి)
* ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)
67వ జాతీయ చలన చిత్ర అవార్డులు
* ఉత్తమ నటుడు: ధనుష్(అసురన్), మనోజ్ బాయ్‌పాయ్(భోంస్లే)
* ఉత్తమ నటి: కంగనా రనౌత్(ఝాన్సీ)
* ఉత్తమ దర్శకుడు: బహత్తార్ హూరైన్
* ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)
* ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)
* ఉత్తమ చిత్రం(హిందీ): చిచోరే
* ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ
* ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్
* ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం(మహర్షి)
* ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ అరబ్(మలయాళం)
* ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో
* ఉత్తమ మేకప్: హెలెన్
* ఉత్తమ గాయకుడు: కేసరి(తేరి మిట్టీ)
* ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)