మహేష్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్..

మహేష్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది మహేష్ బాబు కు ఏమాత్రం కలిసి రాలేదు. వరుస విషాద ఘటనలు ఆయన్ను కుంగదీసాయి. ఒకరు , ఇద్దరు కాదు ఏకంగా ముగ్గుర్ని కోల్పోయాడు మహేష్. అన్న , అమ్మ , నాన్న ఇలా ముగ్గుర్ని కోల్పయి బాధలో ఉన్నాడు. ఈ బాధలో నుండి బయటపడేందుకు త్వరగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనీ అనుకున్నాడు కానీ అది కుదరడం లేదు.

ప్రస్తుతం మహేష్ బాబు ..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ లో పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా , సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మితమవుతుంది. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గరి నుంచి ఏదొక అవాంతరం వస్తూ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడుతుంది. కాగా కొత్త షెడ్యూల్ ను డిసెంబర్ రెండో వారం లో మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు అది కూడా వర్క్ అవుట్ కావడం లేదని సమాచారం. తాజాగా సినిమా షూటింగ్ ను సంక్రాంతి తరువాత పెట్టుకుందాం అని మహేష్, త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారట. అంటే జనవరి మూడో వారం లో మొదలవుతుంది. మరి అప్పుడు మొదలై..ఎప్పుడు పూర్తి అవుతుందో..ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

follow us