కార్తికేయ 3 లో నిఖిల్ తో పాటు మరో హీరో

కార్తికేయ 3 లో నిఖిల్ తో పాటు మరో హీరో

కార్తికేయ 3 లో హీరో నిఖిల్ తో పాటు మరో హీరో నటించబోతున్నాడట. ఈ విషయాన్నీ స్వయంగా నిఖిలే తెలిపాడు. తాజాగా నిఖిల్ నటించిన 18 పేజెస్ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కుమారి 21 ఫేమ్ సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తుండగా..పుష్ప ఫేమ్ సుకుమార్ కథ అందించడం విశేషం. బన్నీ వాసు నిర్మాత. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ , అనుపమ జంటగా ఈ మూవీ లో నటించడం తో ఈ సినిమా ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుస ఇంటర్వూస్ తో బిజీ బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిఖిల్ సినిమా విశేషాలతో పాటు కార్తికేయ 3 విశేషాలు కూడా పంచుకున్నారు. కార్తికేయ 2 సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది కాబట్టి ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో సినిమా రావాలి అంటే స్టోరీ స్క్రిప్ట్ కూడా అంచనాలకు తగ్గట్టుగానే ఉండాలి. కాబట్టి ఆ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దర్శకుడు చందు నాకు ఒక స్టోరీ లైన్ గురించి చెప్పాడు. అలాగే ఈ సినిమాలో మరో హీరో ఉండవచ్చు. లేదా మల్టివర్స్ అనే తరహాలో కూడా రావచ్చు.. అని నిఖిల్ తెలిపాడు.

Tags

follow us