కరోనా ఎక్కడ పుట్టింది ? : మర్చిపోయిన జగన్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైస్ జగన్ కరోనా వైరస్ నివారణపై ప్రెస్ మీట్ నిర్వహించారు .. ఈ నెల 31 వరకు రాష్ట్రం అంతా లాక్ డౌన్ చేసారు.. ఈ విషయం గురించి మాట్లాడుతున్న వైస్ జగన్ కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందో మర్చిపోయి ఈ వైరస్ సౌత్ కొరియా లో ఒకరికి వచ్చిందని అక్కడ నుంచి దేశ దేశాలకు విస్తరించి భయపెడుతుందని అన్నారు.. మరి వెంటనే ఆయనకే తప్పు చెప్పను అని అనిపించిందో లేక పక్కన ఉన్న వాళ్ళు సవరించారో కానీ.. వెంటనే తేరుకొని ఇంతకీ ఎక్కడ పుట్టింది ? చైనా లోన లేక సౌత్ కొరియా లోన అని అక్కడ ఉన్న ప్రతినిధులను అడిగారు.. వెంటనే సౌత్ కొరియా లో ఒకరి నుంచి దేశం అంతా వ్యాప్తి చెందింది, కానీ పుట్టింది మాత్రం చైనా లో అని వైద్య నిపుణులు ఏంటో కథలు కథలు గా చెప్తున్నారని అన్నారు.. జగన్ మొహం లో ఆ అసహనం ఆయన తప్పు చెప్పారనో లేక పక్కన ఉన్న వాళ్ళు ఆయనకి సరి అయినా సమాచారం ఎందుకు ఇవ్వలేదని కోపమో కానీ జగన్ మొహం లో మాత్రం తప్పు మాట్లాడానన్న తేడా తెలిసిపోతుంది.. మరి అంతే కదా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎక్కడ పుట్టిందో చిన్న పిల్లలను అడిగిన చెప్తారు అలాంటిది ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి అయిన వైస్ జగన్ రాష్ట్రంలో ఇప్పటికే 6 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా కరోనా ఎక్కడ పుట్టిందో తెలియకపోవడం ఒక రకంగా లెక్కలేని తనమే కదా..