“అంటే సుందరానికి” కథ ఇదేనా !!

నాచురల్ స్టార్ నాని “గ్యాంగ్ లీడర్” సినిమా తరువాత నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఈ చిత్రాన్నికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో “నిన్నుకోరి” అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రం తరువాత నాని వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవ్వుతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “అంటే సుందరానికి”అనే డిఫరెంట్ టైటిల్ తో ముందుకు వస్తున్నాడు. ఆ చిత్రం యొక్క టైటిల్ ను ఇటీవలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం కథ గురుంచి సినీ వర్గాలనుండి అందుతున్న సమాచారం మేరకు “నాని బ్రాహ్మణ కుటుంబంనకు చెందిన వ్యక్తి అని. పౌరోహిత్యం పాటిస్తూ ఉంటాడు అని చాలా కట్టుబాటులను కలిగిన ఫ్యామిలి అని నాని కి జోడీగా నటించే నజ్రియ మేము కూడా బ్రమ్మినులమే అని చెప్పి హీరో ఇంట్లోకి అద్దెకు దిగుతారని, వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పుయిస్తాయని” తెలుస్తుంది. కామిడీ జోనర్ గా ఈ చిత్రం తెరక్కెక్కనున్నది అని చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం.

“టక్ జగదీష్” చిత్రం తరువాత నాని “టాక్సీవాల” దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో “శ్యామ్ సింగరాయి” అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. అందులో ఒక్కరు సాయి పల్లవి, కృతి శెట్టి. ఆ చిత్రం తరువాతనే “అంటే సుదరానికి” అనే చిత్రం ప్రారంభం కానున్నది.
నాని ఈమధ్య నటించిన సినిమాలు అంతగా ఆకటుకుంది లేదు. అందుకే ఎలాగైనా “టక్ జగదీష్” తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.