డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ కాబోతున్న అనుపమ మూవీ

డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ కాబోతున్న అనుపమ మూవీ

కరోనా కారణంగా ఓటిటి కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కరోనా టైములో థియేటర్స్ మూతపడడం తో సినీ లవర్స్ ఓటిటికి అలవాటుపడ్డారు. ప్రస్తుతం అదే కంటిన్యూ చేస్తున్నారు. అగ్ర హీరోల చిత్రాలు థియేటర్స్ లలో విడుదలవుతున్నప్పటికీ థియేటర్స్ కు వెళ్లి చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. మరోపక్క నిర్మాతలు సైతం ఓటిటిలకు తమ సినిమాలను అమ్మేస్తూ ఉండడం ..విడుదలైన రెండు వారాలకే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుండడం తో థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య తగ్గుతుంది. దీంతో చిన్న నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా కార్తికేయ 2 ఫేమ్ అనుపమ నటించిన ‘బ‌ట‌ర్‌ఫ్లై’ మూవీ నేరుగా ఓటిటి లో రిలీజ్ అవుతుంది. లేడీ ఓరింయెంటెడ్‌ సినిమాగా తెర‌కెక్కిన ఈ మూవీకి గంటా స‌తీష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై విప‌రీత‌మైన క్యూరియాసిటీని పెంచాయి. సినిమా షూటింగ్‌ పూర్తయి దాదాపు నెలలు గడుస్తుంది. కానీ విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతుండడంతో నిర్మాతలు చేసేది లేక ఓటిటి లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు.

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ చిత్రం డిసెంబర్‌ 29నుండి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రాన్ని జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై ర‌విప్ర‌కాష్ బోడ‌పాటి, ప్ర‌సాద్ తిరువ‌ళ్ళూరి, ప్ర‌దీప్ న‌ల్లిమెల్లి సంయుక్తంగా నిర్మించారు.

follow us