క్లైమాక్స్‌లో సీన్లు చూసి అనుపమ కంటతడి

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్…త్వరలో 18 పేజెస్ మూవీ తో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ లో అనుపమ మరోసారి నిఖిల్ తో జోడి కట్టడం విశేషం. “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
ఇక సినిమా ప్రమోషన్ లలో పాల్గొన్న నిఖిల్..అనుపమ తో సినిమాలో తన బాడింగ్ ఎలా ఉందో తెలిపారు. 18 పేజేస్ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ఇటీవల అనుపమ పరమేశ్వరన్ పూర్తి చేసింది. క్లైమాక్స్‌లో సీన్లు చూసి అనుపమ కంటతడి పెట్టింది. అలా కంటతడితోనే ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. మా ఇద్దరి పాత్రల మధ్య బాండింగ్ చాలా వర్కవుట్ అయింది. స్క్రీన్ మీద మీరు చూస్తే.. ఈ సినిమాలో మా బాండింగ్ ఎలా ఉంటుందో మీకే అర్ధం అవుతుంది అని నిఖిల్ చెప్పారు. కార్తీకేయ 2 సక్సెస్ తర్వాత సినిమా కథలను ఎంచుకోవడం పెద్ద ఛాలెంజ్. సినిమాలో ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ లేకపోతే ఆడియెన్స్ థియేటర్‌కు రావడం లేదు. అందుకే సినిమా కథలు ఆడియెన్స్ ఎక్సైటింగ్‌గా ఉండేలా చూసుకొంటున్నాను అని నిఖిల్ తెలిపారు.