వీరసింహరెడ్డి మేకర్స్ కు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

చిత్రసీమను ఏ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పెట్టదు..ప్రజలకు వినోదాన్ని ఇవ్వడమే చిత్ర పరిశ్రమ పని..అందుకే అధికారంలోకి వచ్చిన ఎవ్వరు కూడా చిత్రసీమ కు హెల్ప్ ఫుల్ గా ఉంటారు తప్ప ఇబ్బంది పెట్టాలని మాత్రం చూడరు. కానీ ఎందుకు జగన్ సర్కార్ మాత్రం టాలీవుడ్ ను ఇబ్బందికి గురి చేస్తూ వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా టికెట్ రేటును టీ రేటు కన్నా దారుణంగా తగ్గించి నిర్మాతలను , డిస్ట్రబ్యూటర్స్ ను భారీగా నష్టపరిచారు. దీంతో చాల థియేటర్స్ మూతపడ్డాయి. కొన్నైతే ఏకంగా ఫంక్షన్ హాల్స్ గా మార్చేశారు. ఈ తర్వాత చిత్రసీమ ప్రముఖులు జగన్ వద్దకు వెళ్లి ప్రాధేయపడితే మళ్లీ కాస్త ఉపశమనం కల్పించారు. కొద్దీ రోజులుగా అంత బాగానే ఉంది. ఇక ఇప్పుడు తాజాగా కొత్తగా జీవో తీసుకొచ్చి నిర్మాతలకు , రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చారు.
కొత్త జీవో ప్రకారం.. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదు. రోడ్లకి దూరంగా ఉండే గవర్నమెంట్ గ్రౌండ్స్, ప్రైవేటు స్థలాల్లో వాటిని నిర్వహించుకోవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అరుదైన సందర్భాల్లో మాత్రమే రోడ్లపై సభలు, సమావేశాలకి అనుమతిస్తారు. అది కూడా స్పష్టమైన కారణాలు తెలియజేస్తూ లిఖితపూర్వకంగా అనుమతి కోరితే..? అప్పుడు ఉన్నాతాధికారులు పరిశీలించి అనుమతి ఇస్తారని తెలిపారు. ఈ జీవో కారణంగా రాజకీయ పార్టీలకే కాదు ఇప్పుడు అగ్ర హీరోల తాలూకా సినిమా ఫంక్షన్ లకు సైతం ఇబ్బంది గా మారింది.
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహ రెడ్డి జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ నెల 06 న ఒంగోలు లోని ఏబీఎం కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ప్రాథమికంగా ఏర్పాట్లు కూడా చేసుకుంది. అలానే సోషల్ మీడియా ద్వారా నందమూరి అభిమానులకి ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై సమాచారాన్ని పోస్టర్స్, టీజర్స్ ద్వారా తెలియజేసింది. కానీ ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరగడంపై సందిగ్ధత నెలకొంది.
ఏపీ సర్కార్ విడుదల చేసిన కొత్త జీవో కారణంగా ప్రీ రిలీజ్ వేడుక మార్పు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ కి భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది కనుక ABM గ్రౌండ్ అనువైనది కాదని మరొక వేదికకు మార్పు చేసుకోవాలని పోలీస్ వారు సూచించినట్టు సమాచారం. మరి ఈవెంట్ ను మరో చోటికి మారుస్తారా..లేక తక్కువ సంఖ్యలో అభిమానులు ఉండేలా చేసుకుంటారా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికి జగన్ ప్రభుత్వ జీవో మళ్లీ చిత్రసీమ కు తలనొప్పిగా మారింది.