ఏపీలో బాలు జ్ఞాపకార్థం

ది గ్రేట్ సింగర్ ఎస్‌పి బాలసుబ్రమణ్యం గురించి తెలియని వారంటూ ఉండరు ఎన్నో సినిమాలకు పాటలు పాడిన బాలు ఎన్నో ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చాడు. ఎంతో మందిని గాయని గాయకులుగా, సంగీత దర్శకులుగా తీర్చిదిద్దారు. ఎన్నో సినిమాలోను నటించాడు. తాను ఒక్క సింగర్ మాత్రమే కాదు అని అంటుండేవాడు. తెలుగు, తమిళ్ లో కొన్నివెల పాటలు పాడిన బాలు గారు. తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. ఆయన నటించిన “మిథునం” సినిమాతో అందరినీ నవ్వించి ఏడిపించాడు. చైనాలోని వ్యూహన్ లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఎస్‌పి బాలసుబ్రమణ్యం కూడా కరోనా సోకడం, 42 రోజులపాటు పొరాడి చివరికి మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. కరోనా తో పొరాడి ఓడిన బాలుని మాత్రం తెలుగు ప్రజలు మర్చిపోలేదు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బాలు గారి జ్ఞాపకార్థంగా ఏపీ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ & డాన్స్ పేరును “డా. ఎస్ పి బాలసుబ్రమణ్యం గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ & డాన్స్ ” గా మార్చింది. పలువురు రాజకీయనాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రశంశలు కురిపిస్తున్నారు. బాలు గారు మన మధ్య లేకపోయిన. ఆయన పాటలతో మ్యూజిక్ స్కూల్ మారుమోగనున్నది. బాలు గారి కొడుకు ఎస్‌పి చరణ్ సి‌ఎం జగన్ కు ఏపీ గవర్నమెంట్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.