ఏఆర్ రెహమాన్ కు మాతృవియోగం..

  • Written By: Last Updated:
ఏఆర్ రెహమాన్ కు మాతృవియోగం..

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తల్లి కరీమా బేగం కన్నుమూశారు. రెహమాన్ తల్లి కరీమా బేగం సోమవారం కన్నుమూశారు. వయసురీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న కరీమా బేగం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. నేటి సాయంత్రం కరీనా బేగం అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. కాగా కరీమా బేగం భర్త ఆర్‏కే శేఖర్ రెహమాన్ తొమిదేళ్ళ వయసులోనే మరణించారు. కరీమా బేగం, శేఖర్ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో రెహమాన్ చిన్నవాడు. శేఖర్ కన్నుమూసిన పదేళ్ళ తర్వాత వీరి కుటుంబం మొత్తం ఇస్లాం మతాన్ని స్వీకరించింది. తల్లి కరీమా అంటే రెహమాన్ కు చాలా ప్రేమ. తాను సంగీత దర్శకుడు కాగలననే విశ్వాసాన్ని ఆమె కలగచేసిందని రెహమాన్ చెబుతుంటారు. రెహమన్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖలు ప్రార్థిస్తున్నారు.

follow us