ప్రస్థుతం బాలీవుడ్ నిర్మాతలు సౌత్ సినిమా కథల కోసం రెడీగా ఉంటున్నారు. సినిమా హిట్ అయ్యిందంటే చాలు రీమేక్ రైట్స్ కొనడానికి కర్చీఫ్ లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమా రీమేక్ రైట్స్ ను సైతం బాలీవుడ్ నిర్మాత బోణీకపూర్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా పై చర్చించేందుకు బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ దిల్ రాజు తో ముంబైలో బేటీ అయ్యారు. ఇక ఎఫ్ 2 లో వరుణ్ తేజ్ నటించిన పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ కనిపించబోతున్నారట. ఈ సినిమాను బోణీ కపూర్ సొంత ప్రొడక్షన్ లోనే నిర్మించనున్నారు. ఇప్టటికే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఫైనలైజ్ అయ్యింది. ఇదిలా ఉండగా ఎఫ్ 2 సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిసింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు వెంకటేష్ మరో హీరోగా నటించారు. అంతే కాకుండా ఈ సినిమాలో వరుణ్ కు తేజ్ కు జంటగా మెహ్రీన్ నటించగా..వెంకటేష్ సరసన తమన్నా నటించింది. ఇక టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్ లో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.