శ్యామ్ కే నాయుడిపై పై మరోసారి ఫిర్యాదు..!

సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడిపై సినీ నటి శ్రీ సుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీసుధ గతంలో శ్యాం కే నాయుడిపై పొలిసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కేసు ఉపసంహరించుకోవాలంటూ అతడు బెదిరింపులకు గురిచేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. శ్రీసుద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గతంలో శ్రీసుధ తనను శ్యామ్ కే నాయుడు పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లు కలిసి ఉంది మోసం చేసాడని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా శ్యామ్ కే నాయుడు నకిలీ పత్రాలు కోర్టులో సమర్పించి కేసు నుండి తప్పించుకున్నాడని అతడిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసింది.
అంతే కాకుండా శ్యాం కే నాయుడిపై కేసును ఉపసంహరించుకోవాలని ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫోటో గ్రాఫర్ సాయిరాం మాగంటి తనను బెదిరింపులకు గురి చేసారని పేర్కొంది. చిన్నా నివాసానికి తనకు పిలిచి చిన్నా, సాయిరాం, శ్యామ్ కే నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారని.. శారీరకంగా దాడి చేసారని ఫిర్యాదులో పేర్కొంది. దాంతో తాను ఇన్ని రోజులు భయటకు రాలేదని..ఇప్పుడు తనకు శ్యామ్ కే నాయుడు అతడి బంధువుల నుండి ప్రాణ హాని ఉన్నందున ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపింది. శ్రీ సుధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసును మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తునట్టు తెలిపారు.