`అశ్వ‌థ్థామ` డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య‌

  • Written By: Last Updated:
`అశ్వ‌థ్థామ` డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య‌

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన నిన్నే నిన్నే సాంగ్‌, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెస్పాన్స్‌తో నాగ‌శౌర్య మ‌రింత ఉత్సాహాంగా డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. యథార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా హీరో నాగ‌శౌర్య ఈ క‌థ‌ను రాశారు. కేవ‌లం యాక్ష‌న్ ఎలిమెంట్సే కాదు.. మంచి మెసేజ్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

Tags

follow us

Web Stories