సలార్ కోసం అడిషన్స్ ! ఎప్పుడంటే ?

సలార్ కోసం అడిషన్స్ ! ఎప్పుడంటే ?

“సాహో” చిత్రం తర్వాత రాధా కృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న చిత్రం “రాధే శ్యామ్” ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తుంది. పిరియడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో మూడు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టాడు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యాలిసి ఉంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో “ఆదిపురుష్” అనే సినిమా ఉంది. ఇటీవల ప్రభాస్ కేజీయఫ్ దర్శకుడితో “సలార్” అనే చిత్రంలో నటించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం గురుంచి “సలార్” టీమ్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. “సలార్” కోసం అడిషన్స్ ను నిర్వహిస్తున్నట్లుగా ప్రకటన ఇచ్చారు.

తేదీ 15/12/2020 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ అడిషన్స్ జరుగుతాయని దానికోసం హైదరాబాద్ లోని శేర్లింగంపల్లి వద్ద ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ వేదిక అవ్వుతుంది. ఏ బాషలో అయిన సరే ఒక్క నిమిషం సేపు యాక్ట్ చెయ్యాలని అన్నారు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు వచ్చిన అవకాశాని వినియోగించుకోవాలని కోరారు. త్వరలోనే బెంగలూర్ అండ్ చెన్నైలో అడిషన్స్ జరగనున్నాయి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీయఫ్ ఫైనల్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నాడు.

follow us