అవతార్ కు అవసరాల అవసరం పట్టింది

అవతార్ 2 మూవీ కి నటుడు , రచయిత అవసరాల శ్రీనివాస్ వర్క్ చేసాడు. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కేమరూన్ రూపొందించిన అవతార్ 2 కోసం యావత్ సినీ లోకం తో పాటు ప్రజానీకం ఎదురుచూస్తుంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ సీక్వెల్ ను జేమ్స్ కేమరూన్ ఏ రేంజ్లో చిత్రీకరించాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ‘అవతార్’ కలెక్షన్లను ఈ మూవీ ఒక్క రోజులోనే బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. డిసెంబర్ న ఈ మూవీ పలు భాషల్లో విడుదల కాబోతుంది.
అయితే ‘అవతార్ 2’ కోసం టాలీవుడ్ దర్శకుడు, రచయిత అవసరాల శ్రీనివాస్ పని చేశాడట. ‘అవతార్’ తెలుగు వెర్షన్ కు ఆయన డైలాగ్స్ రాశారట. గతంలో హాలీవుడ్ సినిమాల తెలుగు వెర్షన్ డైలాగులు చాలా కామెడీగా అనిపించేవి. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ కోసం నోటెడ్ రైటర్స్ ను హాలీవుడ్ మేకర్స్ సంప్రదించేవారు కాదు. అయితే ఇప్పుడు తెలుగు మార్కెట్ వరల్డ్ వైడ్ గా పెరగడం తో ఇతర భాషల వారు జాగ్రత్తపడుతున్నారు. అవతార్ 2 కూడా అలాగే జాగ్రత్తలు పడి, అవసరాలను ఎంపిక చేశారట. గతంలో అవసరాల ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు వెర్షన్ కు కూడా డైలాగులు రాయడం జరిగింది. ఇక ఇప్పుడు అవతార్ 2 కు రాయడం విశేషం.