అవతార్ 2 కు ఫిదా అవుతున్న ప్రేక్షకులు

అవతార్ 2 కు ఫిదా అవుతున్న ప్రేక్షకులు

అంత భావించినట్లే అవతార్ 2 మూవీ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఈరోజు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో అవతార్ 2 రిలీజ్ అయ్యింది. 2009లో పండోరా గ్ర‌హంపై అద్భుతాల‌ను ఆవిష్క‌రించిన జేమ్స్ కామెరూన్ 13 ఏళ్ల త‌ర్వాత అవ‌తార్ 2ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. అవ‌తార్ 2 సినిమాను నీటిలో జ‌రిగే అందాలు, పోరాటాల వండ‌ర్‌గా చిత్రీక‌రించారు. అవ‌తార్ సినిమాలో పండోరా అనే అంద‌మైన గ్ర‌హం.. దాని అందాల‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్క‌రించిన జేమ్స్ కామెరూన్ .. అవ‌తార్ 2ని నీటిలో ఉండే అందాలు, జ‌ల‌చ‌రాలు, వాటికి మ‌నుషుల‌తో ఉండే అనుబంధాల‌ను ఆవిష్క‌రించారు.

సాధార‌ణంగా ప్ర‌తి సినిమాను విజువ‌ల్ వండ‌ర్‌గా చూపించే జేమ్స్ కామెరూన్ అవ‌తార్ 2లో నీటిలో అందాల‌ను అద్బుత‌మైన విజువ‌ల్స్‌తో చూపించి ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లారు. చిన్న పెద్ద ఇలా అంత కూడా సినిమాను చూసే ఎంతో థ్రిల్ అవుతున్నారు.

follow us