బుకింగ్స్ తోనే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న అవతార్ 2

అవతార్ మేనియా ఎలా ఉందో బుకింగ్స్ తోనే అర్థమైపోతుంది. అడ్వాన్స్ బుకింగే ఈ రేంజ్ లో జరుగుతుంటే..రేపు సినిమా రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి ఎలా ఉంటుందో అని ఇప్పటి నుండే అంత లెక్కలు వేసుకుంటున్నారు.హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కేమరూన్ రూపొందించిన అవతార్ 2 కోసం యావత్ సినీ లోకం తో పాటు ప్రజానీకం ఎదురుచూస్తుంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ సీక్వెల్ ను జేమ్స్ కేమరూన్ ఏ రేంజ్లో చిత్రీకరించాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ‘అవతార్’ కలెక్షన్లను ఈ మూవీ ఒక్క రోజులోనే బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు.
రేపు డిసెంబర్ 16 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అవతార్ 2 భారతదేశంలో అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా అవతరించిందనేది తాజా ట్రేడ్ రిపోర్ట్. ఇప్పటివరకూ భారతదేశంలో రిలీజైన అన్ని హాలీవుడ్ చిత్రాల రికార్డులను ‘అవతార్ 2’ బ్రేక్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్గ్ బుకింగ్ ద్వారానే పలు హాలీవుడ్ మూవీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిందని , రేపు సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి రేపు సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.