అవతార్ 3 , 4 , 5 రిలీజ్ డేట్స్ ఫిక్స్

అవతార్ 3 , 4 , 5  రిలీజ్ డేట్స్ ఫిక్స్

హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కేమరూన్ రూపొందించిన ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో డిసెంబర్ 16 న విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తుంది. సినిమా విడుదలై దాదాపు 20 రోజులు కావొస్తున్నా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

ఫస్ట్ పార్ట్ లో నటించిన వాళ్లతోనే సెకండ్ పార్ట్ ను కొనసాగించాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. విజువల్ వండర్‌గా దాదాపు 350 – 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించాడు. హాలీవుడ్ నుంచి వచ్చే ఎలాంటి చిత్రానికైనా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన దక్కుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో వచ్చిన ‘అవతార్ 2’ కూడా అలాగే రాబట్టింది.

ఇక ఇప్పుడు అవతార్ మిగతా పార్ట్శ్ రిలీజ్ డేట్స్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు. 2024 శుక్రవారం డిసెంబర్ 20 న అవతార్ 3 ని , 2026 శుక్రవారం డిసెంబర్ 18 న అవతార్ 4 ని , 2028 శుక్రవారం డిసెంబర్ 22 న అవతార్ 5 ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. అంటే ఒక్కో పార్ట్ కు రెండేళ్ల గ్యాప్ ఉండేలా రిలీజ్ చేయబోతున్నారు.

follow us

Related News