అవతార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్

అంత భావించినట్లే అవతార్ 2 మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రికార్డు బ్రేక్ కలెక్షన్లు రాబట్టింది. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కేమరూన్ రూపొందించిన అవతార్ 2 కోసం యావత్ సినీ లోకం తో పాటు ప్రజానీకం వెయ్యి కళ్లతో ఎదురుచూసారు. వారి ఎదురుచూపులు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించారు జేమ్స్ కేమరూన్. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కొత్త లోకానికి తీసుకెళ్లారని అవతార్ కు మించేలా అవతార్ 2 ఉందని చెపుతున్నారు.
ఇక ఫస్ట్ డే తెలుగు కలెక్షన్లు చూస్తే..
నైజాంలో రూ. 7.05 కోట్లు
సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 4.80 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. మొత్తంగా తొలిరోజు రూ. 13.65 కోట్లు గ్రాస్, రూ. 7 కోట్లు పైగా షేర్ వసూలు రాబట్టింది. అలాగే ఈ ఏడాది తెలుగు లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన డబ్బింగ్ సినిమాల జాబితాలో ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది. ఇందులో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రూ. 31 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇక, ఈ లిస్టులో విజయ్ ‘బీస్ట్’ మూవీ రూ. 9 కోట్లతో మూడో స్థానంలోనూ, ‘బ్రహ్మాస్త్ర’ రూ. 7 కోట్లతో నాలుగో స్థానంలోనూ నిలిచాయి.