ఎకిలి నవ్వుల సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ కూతురు అంటూ నిహారికా పై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు !!

ఎకిలి నవ్వుల సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ కూతురు అంటూ నిహారికా పై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు !!

బాబు గోగినేని పెద్దగా పరిచయం చెయ్యనక్కరలేని పేరు. బిగ్ బాస్ షో కు ముందు ఈయన ఎవరో ఎవరికి తెలియదు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత అందరికి బాగా పరిచయం అయ్యాడు. ఈయన ఎక్కువగా ప్రజల్లో పెనవేసుకున్న మూడ నమ్మకాలపై పోరాటం చేస్తూ ఉంటాడు. ఓ విదంగా చెప్పాలంటే నాస్తికుడు. హేతువాది .

టి‌వి ఛానెల్స్ లో వాటిపై డిబేట్స్ మీద డిబేట్స్ పెడుతూ ఎప్పుడు ఇతనే కనిపించేవాడు. టీవి చూసే వాడికి కూడా చిరాగ్గా అనిపించేది. బిగ్ బాస్ 2 తర్వాత బాబు గోగినేని ఎక్కడ కనిపించలేదు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా నాగబాబు ఆయన కూతురు నిహారికా పై కామెంట్స్ చేశాడు. ఈ మధ్య నిహారికా మ్యారేజ్ గురుంచి పత్రికల్లో సోషల్ మీడియాలో న్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే. ఉదయ్ పాలస్ లో పెండ్లి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కావునా తెలుగు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

బి‌బి‌సి ఛానెల్స్ ను బేస్ చేసుకొని ఇండిరెక్ట్ గా తెలుగు పత్రిక చన్నెల్స్ పై సెటైర్స్ వేశాడు. వెకిలి నవ్వులు సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ కూతురు అంటూ తనకు తెలిసిన బాషలో సెటైర్స్ వేశాడు. BBC లో క్రమం తప్పకుండ దేవుండ్ల దర్శనం, నిద్ర సమయాలు వేసే మీరు మిగతా పత్రికల్లో లాగా లేరు అంటూ… ఇక నాగబాబు కూతురుగా తప్ప పెద్దగా గుర్తింపు లేదు. నిహారికా జీవితంలో అచీవ్ మెంట్ చేసింది ఏమీలేదు. అలాగే నాగబాబు పై ఓ సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ గా తప్ప ఆయనకు ఏ విదమైన గుర్తింపు లేదు అంటూ ఆయనకు తెలిసిన బాషలో విరుచుకుపడ్డాడు.

బాబు గోగినేని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ , సామాన్య ప్రజలు సైతం మండి పడుతున్నారు. మెగా ఫ్యామిలి నుండి ఇంతవరకు హీరోయిన్ గా ఎవరు రాలేదు. అలాంటి కుటుంబం నుండి వచ్చిన నిహారికా తను తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఓ స్టార్ నటిగా కాకపోయిన తను చేసిన సినిమాలకు న్యాయం చేసింది. వెబ్ సిరీస్ అంటే ఏమిటో తెలియని రోజుల్లో ఓ వెబ్ సిరీస్ లో నటించి అందరి చేత శభాస్ అనిపించుకుంది.

టి‌వి 9 రవిప్రకాశ్ సైతం ఇంటర్నెట్ క్వీన్ అంటూ పొగిడేసిన సందర్భాని గుర్తు చేశారు. ఇక నాగబాబు గారు సినిమాల్లో నటుడిగా, బుల్లి తెర కామిడీ షో లకు హోస్ట్ గా చేస్తూ ప్రజలను నవ్విస్తున్నాడు అంటూ బాబు ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. మరి కొంతమంది ఈయనకు కుల పిచ్చి కూడా ఉంది అంటున్నారు. అందుకే నాగబాబు, నిహారికాపై సెటైర్స్ వేశాడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

నిహారికా అచీవ్ మెంట్ గురుంచి మాట్లాడిన బాబు గోగినేని. అనిల్ అంబానీ కూతురు ఈషా అంబానీ పెళ్లి కూడా అదే ప్యాలెస్ లో జరిగింది. అప్పుడు బాబు గోగినేని ఎటుపోయాడు అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు. ఈషా అంబాని, అనిల్ అంబానీ కూతురు గా మాత్రమే తెలుసు ఆమె ఏ విదమైన అచీవ్ మెంట్ చెయ్యలేదని బాబు గోగినేనికి సోషల్ మీడియా సాక్షి గా గుర్తి చేస్తున్నారు.

follow us